Wednesday, May 15, 2024

GST collections : రికార్డు స్థాయిలో జీఎస్టీ వ‌సూళ్లు

వరుసగా ఆరోసారి జీఎస్​టీ వసూళ్లు లక్షా 30వేల కోట్లు దాటాయి. ఈ ఏడాది మార్చిలో జీఎస్​టీ వసూళ్లు జీవిత కాల గరిష్ఠాన్ని తాకాయి. ఏకంగా 1.42 లక్షల కోట్ల రాబడి వచ్చినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే నెల రాబడులతో పోల్చితే 15 శాతం వృద్ధి నమోదైంది. మార్చిలో వచ్చిన జీఎస్టీ రాబడుల్లో కేంద్ర జీఎస్టీ కింద రూ.25.830 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ కింద రూ.32,378 కోట్లు, సమీకృత జీఎస్టీ కింద రూ.74,470 కోట్లు (అందులో దిగుమతులపై పన్ను వసూళ్ల ద్వారా రూ.39,131 కోట్లు వచ్చాయి.) సెస్​ కింద రూ.9,417 కోట్లు (అందులో దిగుమతుల ద్వారా రూ.981 కోట్లు) వచ్చాయి. ఎగవేతదారులను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవడం సహా రిటర్న్​లు దాఖలు చేయడంలో మార్పులు చేసినందున నకిలీ ఇన్​వాయిల్​ల ద్వారా ఐటీసీ తీసుకునేందుకు అవకాశాలను నిలువరించింది కేంద్రం. ఇకపై నెల నెలా వచ్చే జీఎస్టీ వసూళ్లూ అనూహ్యంగా పెరిగే అవకాశముంద‌ని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement