Tuesday, May 7, 2024

బిగ్ సేల్స్‌తో దూసుకెళ్తున్న రియ‌ల్‌మీ 11 ప్రొ.. బ‌డ్జెడ్ రేంజ్‌లో ఉండ‌డంతో ఆస‌క్తి

గత వారం రిలీజ్ అయిన‌ Realme 11 Pro Plus 5 జీ స్మార్ట్ ఫోన్‌ కు మొబైల్ లవర్స్ నుంచి విశేష స్పందన ల‌భిస్తోంది. ప్రారంభ సేల్ లో ఏకంగా 2 లక్షల ఫోన్లను విక్రయించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ స్మార్ట్‌ఫోన్‌. 200 మెగా పిక్సెల్ కెమెరాతో వచ్చిన Realme 11 Pro Plus ఫోన్ ను సొంతం చేసుకునేందుకు వినియోగదారులు ఎగబ‌ప‌డుతున్నారు. బుకింగ్స్ ఓపెన్ అయిన తొలి రోజే మొత్తం 60 వేల ఫోన్లను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది.

ధర రూ.25 వేలకు పైన ఉన్న ఫోన్లకు తొలిరోజు ఇన్ని బుకింగ్స్ రావడం తమ కంపెనీ చరిత్రలో ఇదే మొదటి సారి అని పేర్కొంది. రియల్ మీ 11 ప్రో ప్లస్ 5 జీ ఫోన్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నందుకు ఆనందంగా ఉందని స్పష్టం చేసింది. కాగా, ఈ ఫోన్ ధ‌ర ఈ-కామర్స్ వెబ్ సైట్ లేదా యాప్ లో రూ.20,000 నుంచి రూ.30,000 మధ్య రేంజ్ ఫోన్లలో తొలిరోజు అత్యధికంగా అమ్ముడైన ఫోన్లు ఇవే కావడం గమనార్హం. కాగా.. రియల్ మీ 11 ప్రో 5 జీ ఫోన్ ప్రారంభ ధర రూ.23,999 గా ఉంది.

- Advertisement -

Realme 11 Pro Plus ఫీచర్స్‌..

-6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే
-ఆక్టా కోర్ 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసీ ప్రాసెసర్
-ట్రిపుల్ రియర్ కెమెరా విత్ 200 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా
-32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
-బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
-ఆస్ట్రాల్ బ్లాక్, ఒయాసిస్ గ్రీన్, సన్ రైజ్ బీజ్ కలర్లలో అందుబాటులో ఉంది.
-8జీబీ ర్యామ్, 256 జీబీ మెమొరీ వేరియంట ధర రూ. 27,999 గా ఉంది.
-ఇక 12 జీబీ ర్యామ్, 256 మెమొరీ వేరియంట్ ధర రూ.29,999 గా నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement