Monday, April 29, 2024

థియేటర్లకు ‘వర్షం’ ఎఫెక్ట్​.. ప్ర‌భాస్ బ‌ర్త్ డే రోజు రీ-రిలీజ్ సంద‌డి

ప్ర‌భాస్ కెరీర్‌లో తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన వ‌ర్షం సినిమా మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. శోభ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ్యూజిక‌ల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన వ‌ర్షం సినిమాతోనే ప్ర‌భాస్ మాస్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతోనే కెరీర్‌లో తొలి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు ప్ర‌భాస్‌. దేవిశ్రీప్ర‌సాద్ స్వ‌ర‌ప‌ర‌చిన పాట‌లు పెద్ద హిట్ అయ్యాయి. దాదాపు ఆరు కోట్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా మూడింత‌ల లాభాల్ని తెచ్చిపెట్టింది. ప్ర‌స్తుతం ఆదిపురుష్, స‌లార్‌, ప్రాజెక్ట్ కేతో పాటు ప‌లు పాన్ ఇండియ‌న్ సినిమాల్లో న‌టిస్తూ ప్ర‌భాస్ బిజీగా ఉన్నాడు.

కాగా, ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 22, 23 తేదీల‌లో తెలంగాణ‌తో పాటు ఏపీలో ఈసినిమాను రీ-రిలీజ్ చేయ‌నున్న‌ట్లు నిర్మాత ఎం.ఎస్.రాజు ప్ర‌క‌టించాడు. 4కే టెక్నాల‌జీతో వ‌ర్షం సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు పేర్కొన్నారు. వ‌ర్షంతో పాటు ప్ర‌భాస్ హీరోగా న‌టించిన రెబెల్, బిల్లా సినిమాలు కూడా ఈ నెల‌లోనే రీ రిలీజ్ కానున్నాయి. రెబెల్ సినిమాను అక్టోబ‌ర్ 15న విడుద‌ల‌చేయ‌బోతున్నారు. బిల్లా రీ రిలీజ్ డేట్‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement