Thursday, May 2, 2024

WTCలో రవిచంద్రన్ అశ్విన్ రికార్డు

ఐసీసీ తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నీలో టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ రికార్డు సాధించాడు. ఈ టైటిల్ భారత్‌కు దక్కకపోయినా.. ఓవరాల్‌గా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూటీసీ టోర్నీలో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 26 ఇన్నింగ్సుల్లో 71 వికెట్లు పడగొట్టాడు. 2.62 ఎకానమీతో నాలుగు సార్లు ఐదు వికెట్ల ఘనతను సాధించాడు.

అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రెండో స్థానంలో ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ ఉన్నాడు. అతడు 14 మ్యాచ్‌లలో 28 ఇన్నింగ్సుల ద్వారా 70 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 17 మ్యాచ్‌లు ఆడి 32 ఇన్నింగ్సుల ద్వారా 69 వికెట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. కాగా కొన్నాళ్ల కిందట అశ్విన్‌ను ఆల్‌టైం బెస్ట్ క్రికెటర్లలో చేర్చడానికి తనకు ఇబ్బందులు ఉన్నాయని సంజయ్ మంజ్రేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అశ్విన్ తన ఆట ద్వారా విమర్శకుల నోళ్లు మూయించాడు.

ఇది కూడా చదవండి: టీమిండియాకు కొరకరాని కొయ్యగా మారిన న్యూజిలాండ్

Advertisement

తాజా వార్తలు

Advertisement