Monday, May 6, 2024

కేసీఆర్ ప్రైవేట్ ఆస్పత్రికి.. పేదలు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లాలా?

సీఎం కేసీఆర్‌కు కరోనా వస్తే ప్రభుత్వ ఆస్పత్రికి ఎందుకు వెళ్లలేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఆ ఆస్పత్రులపై మీకు  నమ్మకం లేదా? అని ప్రశ్నించారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా ఆమె తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ కు ఒక న్యాయం పేద ప్రజలకు ఒక న్యాయమా ? అంటూ నిలదీశారు. తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డిది పెద్ద మనసని, పేద వాళ్ల కోసం ఆయన ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్యాన్ని అందించిన ఘనత తన తండ్రిదని గుర్తు చేశారు. అయితే తెలంగాణలో ఆరోగ్యశ్రీ అందడం లేదని మండిపడ్డారు.

కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చమంటే..కేసీఆర్ ఆయుష్మాన్ భారతో లో చేర్చారని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ వేస్ట్ అన్న సీఎం కేసీఆర్…అదే పథకంలో ఆరోగ్య శ్రీని ఎందుకు చేర్చారని నిలదీశారు. పేదవాళ్లను కేసీఆర్ సర్కారు ఆదుకోవడం లేదని విమర్శించారు. కరోనాతో చనిపోయిన పేద ప్రజల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇవ్వాలి షర్మిల డిమాండ్ చేశారు. ప్రాణాలతో ఉంటే చాలని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి..అప్పుల పాలైయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని షర్మిల డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: ఏపీలో పరిషత్ ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే

Advertisement

తాజా వార్తలు

Advertisement