Sunday, April 28, 2024

సీఎం జగన్ కేసుల ఉపసంహరణపై హైకోర్టు ఆదేశాలు

ఏపీ సీఎం జగన్‌పై గతంలో నమోదైన 11 కేసుల్లో ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌ ఉపసంహరించుకోవటంపై ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకుంది. సుమోటో కేసుపై ఇవాళ విచారణ జరిగింది. పరిపాలన కమిటీ ఇచ్చిన నివేదికను తమ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. సీల్డ్‌ కవర్‌లో నివేదిక సమర్పించాలని తెలిపింది. నివేదికను పరిశీలించిన అనంతరం ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది.

సీఎం జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అనంతపురం, గుంటూరు జిల్లాల్లో నమోదైన 11 కేసుల్లో ప్రాసిక్యూషన్‌ ఉపసంహరించుకోవటంపై ఇటీవల జ్యుడీషియల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కమిటీ విచారణ జరిపి ఓ నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగానే హైకోర్టు సుమోటోగా తీసుకుంది. కాగా ఇదే అంశంపై గురువారం నాడు ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదనలు వినిపించారు. జ్యుడిషియల్ అధికారాలను హైకోర్టు పరిపాలన కమిటీ అతిక్రమించిందని, దీనిని హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్ మెంట్ సుమోటోగా తీసుకోవడానికి వీల్లేదని వాదించారు. ఇది సీఆర్పీసీకి వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో పరిషత్ ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే

Advertisement

తాజా వార్తలు

Advertisement