Tuesday, April 30, 2024

వైసీపీ ఫిర్యాదును పట్టించుకోవద్దు.. లోక్ సభ స్పీకర్ ను కోరిన రఘరామ!

తనపై అనర్హత వేటు వేయాలంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోవద్దంటూ లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తాను పార్టీ క్రమశిక్షణను ఎక్కడా ఉల్లంఘించలేదని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను చక్కదిద్దుకోవాలని సూచించడం.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కిందకు రాదని చెప్పారు. భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అసమ్మతి కాదన్నారు. తన ప్రవర్తన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు రాదని, పార్టీ విప్‌ను ఎన్నడూ ఉల్లంఘించలేదని లేఖలో రఘురామ పేర్కొన్నారు. ఈ లేఖతో పాటు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా జత చేశారు.

కాగా, రెండు రోజుల క్రితం నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేయాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ నేతలు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్ దాఖలు చేసి 11 నెలలు గడిచిందని తెలిపారు. అయినా ఇప్పటికీ అతనిపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడం విచారకరమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.  

ఇదీ చదవండి: రఘురామకృష్ణరాజుపై వేటు వేయండి: లోక్ సభ స్పీకర్కు వైసీపీ లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement