Tuesday, April 16, 2024

అలీ నరేష్ కు అల్ ది బెస్ట్…ప్రభాస్

సీనియర్ నటుడు నరేష్ , అలీ ముఖ్య పాత్రలలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన వికృతి సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా పేరు అందరూ బాగుండాలి… అందులో నేనుండాలి. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అలీ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. పదకొండు వందల సినిమాల్లో నటించిన అలీ… హీరోగా తన బ్యానర్ లో నిర్మిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

అయితే ఈ సినిమా సుమారు 20 మంది అగ్ర నటీనటులతో నిర్మించారట. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించిన కొంత మంది వల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా అలీకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శుభాకాంక్షలు తెలిపారు.

అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే బ్యానర్‌ ని స్టార్ట్ చేసి అలీ సినిమాలు తీయటం చాలా ఆనందంగా ఉందని అన్నారు ప్రభాస్. ఆయన బ్యానర్‌ సౌండ్‌ కూడా చాలా బాగుందన్నారు. అలాగే ఈ మూవీ తో ఏ.ఆర్‌. రెహమాన్‌ అసిస్టెంట్‌ రాకేశ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నారట. అలీ నరేశ్‌ గారికి అలాగే వారి టీమ్‌ అందరికి ఆల్‌ ది బెస్ట్‌ అంటూ పేర్కొన్నారు ప్రభాస్.

ప్రభాస్ రాధే శ్యామ్ కూడా స్టార్ట్ అయిపోయింది!

Advertisement

తాజా వార్తలు

Advertisement