Saturday, April 27, 2024

మాస్ పార్టీ సాంగ్ -డిక్కా.. డిష్యూం

మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం ‘రావణాసుర’. ఇటీవలే విడుదలైన తో ఆసక్తిని పెంచింది. టీజర్‌ రవితేజని విభిన్నంగా చూపించింది. సుధీర్‌ వర్మ దర్శకత్వం వ#హంచిన ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రూపొందుతోంది. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ అలరిస్తున్నాయి.
తాజాగా భీమ్స్‌ సిసిరోలియో కంపోజ్‌ చేసిన రావణాసుర మాస్‌ పార్టీ సాంగ్‌ డిక్కా డిష్యూం ని విడుదల చేశారు. పాటలో రవితేజ చేసిన మాస్‌ మూమెంట్స్‌ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. కాసర్ల శ్యామ్‌ సాహత్యం, పార్టీ మాస్‌ పార్టీ ఎలివేట్‌ చేస్తూ ఆకట్టుకుంటే.. స్వాతి రెడ్డి యూకే, భీమ్స్‌ సిసిరోలియో, నరేష్‌ మామిండ్ల ముగ్గురూ కలసి ఈ పాటని హుషారుగా అలపించారు.
విజయ్‌ కార్తీక్‌ కన్నన్‌ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి శ్రీకాంత్‌ విస్సా యూనిక్‌ కథను అందించారు. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్‌ నామా, రవితేజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్‌ నూలి ఎడిటర్‌.
ఏప్రిల్‌ 7న సమ్మర్‌ స్పెషల్‌ గా ప్రపంచ వ్యాప్తంగా ‘రావణాసుర’ గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది. ఈ చిత్రంలో రవితేజ, సుశాంత్‌, అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్‌, పూజిత పొన్నాడ, రావు రమేష్‌, మురళీ శర్మ, తదితరులు నటిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement