Tuesday, April 16, 2024

రాహుల్ పై వేటు …భగ్గుమన్న కాంగ్రెస్ నేతలు..

న్యూఢిల్లీ – కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీపై అనర్హత వేటు వేయడంపై ఆ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఆయన అనర్హత వేటుపై న్యాయపోరాటంతో పాటు రాజకీయంగాను పోరాడుతామని చెప్పింది. సూరత్ కోర్టు తీర్పు ఇచ్చిన సందర్బంలోనే పై కోర్టును ఆశ్రయించేందుకు 30 రోజులు గడువు ఇస్తూ స్టే ఇచ్చింద‌ని కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు.. ఇంత‌లోనే ఆయ‌న‌పై అన‌ర్ష‌త వేటు వేయ‌డం క‌క్ష సాధింపు చ‌ర్య‌నంటూ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు అంటున్నారు.. అలాగే రాహుల్‌గాంధీపై బీజేపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. రాహుల్ బలహీనవర్గాలకు వ్యతిరేకమనే ముద్ర వేయడం దారుణమని అన్నారు… లలిత్ మోడీ.. నీరవ్‌మోడీ వీరంతా బలహీనవర్గాల వారా అని ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై జేపీసీ కోసం పట్టుబడుతున్నందుకే కక్షసాధింపు చర్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌ వ్యాఖ్యల అంశం పరువునష్టం కలిగించేంత పెద్దది కాదని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. రాహుల్‌ అనర్హత వేటు అంశంపై ఎంతవరైనా పోరాడతామని స్పష్టం చేశారు. నిజాలు మాట్లాడే ప్రతి ఒక్కరిని సభ నుంచి గెంటేస్తున్నారని దుయ్యబట్టారు. మ‌రో నేత జై రాం ర‌మేష్ స‌భ‌లో గొంతు ఎంత‌కుండా చేసేందుకే రాహుల్ పై అన‌ర్ష‌త వేటు వేశార‌ని ఆరోపించారు.. తెలంగాణ పిసిపి చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాజరిక వ్య‌వ‌స్థ‌లా కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని, ప్ర‌భుత్వంపై గ‌ళం విప్పిన నేత‌ల నోళ్లు నొక్కేస్తున్నార‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement