Wednesday, May 29, 2024

నేటి రాశిఫ‌లాలు(18-7-2022)

మేషం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

వృషభం: కార్యజయం. నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

మిథునం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.

కర్కాటకం: పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. భూవివాదాలు. కుటు-ంబంలో చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో పనిభారం. మానసిక అశాంతి.

సింహం: అనుకోని సంఘటనలు. దూరప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. మానసిక అశాంతి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థులకు చికాకులు. అనారోగ్యం.

- Advertisement -

కన్య: అనుకోని ధనవ్యయం. దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. కుటు-ంబ, ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని చికాకులు. బంధవులతో తగదాలు.

తుల: పనుల్లో ఆటంకాలు. వ్యవహారాలు ముందుకు సాగవు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

వృశ్చికం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సమావేశాలకు హాజరవుతారు. బంధువుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

ధనుస్సు: మిత్రుల నుండి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటు-ంబంలో సమస్యలు. అనారోగ్యం. అనుకోని ఖర్చులు. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో శ్రమ. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు వాయిదా.

మకరం: బంధువుల నుంచి శుభవార్తలు. రాబడి ఆశాజనకంగా ఉంటు-ంది. కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మీయులతో చర్చలు జరుపుతారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగవర్గాలకు పదోన్నతి సూచనలు.

కుంభం: అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటు-ంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులు,స్నేహితులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారులకు నిరుత్సాహం. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది.

మీనం: ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి. బంధువుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలబ్ధి. చిన్ననాటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు. ఉద్యోగులకు ప్రయత్నాలు సఫలం. వ్యాపారులకు కొత్త ఆశలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement