Thursday, May 2, 2024

గోవాలో బ్రిట‌న్ మ‌హిళ‌పై అత్యాచారం

గోవాకు వ‌చ్చిన ఓ మ‌హిళా టూరిస్ట్ పై స్థానికంగా నివ‌సించే ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. బాధిత మ‌హిళ గోవా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళితే.. హాలీడే కోసం త‌న భ‌ర్త‌తో క‌లిసి గోవాకు వ‌చ్చింది బ్రిట‌న్ కు చెందిన ఓ మ‌హిళ. గోవాలో ఈ నెల 2న అరంబోల్ స్వీట్ వాటర్ బీచ్ వద్ద సేద మహిళ తీరుతున్న క్రమంలో స్థానికంగా నివాసముండే నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement