Monday, May 6, 2024

సోనీ లివ్ లో రామారావు ఆన్ డ్యూటీ-ప్ర‌క‌టించిన మేక‌ర్స్

ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది మాస్ మ‌హారాజ్ ర‌వితేజ న‌టించిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా దివ్యాంశా కౌశిక్, రజిషా విజయన్ హీరో హీరోయిన్లు తెరకెక్కిన తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ చిత్రం గత నెల 29వ తేదీ ప్రేక్షకులకు ముందుకు వచ్చినా ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే ఈ సినిమాలో రవితేజ ఒక పవర్ఫుల్ అధికారిగా కనిపించారు. ఈ క్రమంలోనే అవినీతిపరులైన రాజకీయ నాయకుల భరతం పట్టే అధికారి గా రామారావు పాత్రలో రవితేజ నటించారు. అయితే తాజాగా ఈ సినిమా రేపు ఓటీటీ లో రిలీజ్ కానుంది. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.హీరో రవితేజ క్రాక్ సినిమాతో మళ్లీ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో వరుస పెట్టి అవకాశాలు వ‌స్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement