Wednesday, May 1, 2024

కృష్ణ వ్రింద విహారి చిత్రం నుండి టైటిల్ సాంగ్ రిలీజ్

ల‌వ్ ..కామెడీ ట‌చ్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు హీరో నాగ‌శౌర్య‌. ఆ సినిమానే కృష్ణవ్రింద విహారి.నాగ‌శౌర్య‌ సొంత బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించారు. అనీష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో షిర్లే సెటియా హీరోయిన్ గా పరిచయమవుతోంది. సీనియ‌ర్ న‌టి రాధిక కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, బ్రహ్మాజీ .. వెన్నెల కిశోర్ .. రాహుల్ రామకృష్ణ .. సత్య ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘గుడు గుడు గుంజం గోవిందా టార్చర్ ఇట్లా ఉంటుందా .. నేనే పడ్డ ఈ గొయ్యి నా కోసం నే తవ్విందా .. కృష్ణ వ్రింద విహారి .. ఏది దారి’ అంటూ ఈ పాట నడుస్తోంది. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను రామ్ మిర్యాల ఆలపించాడు. ప్రేమించిన అమ్మాయి కోసం హీరో పడే పాట్లపై ఈ టైటిల్ సాంగ్ కొనసాగింది. కొంతకాలంగా వరుస ఫ్లావులతో ఉన్న నాగశౌర్య, ఈ నెల 23న విడుదల కానున్న ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement