Friday, September 22, 2023

రేప‌టి నుండి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు-మూడు రాజ‌ధానుల‌పై చ‌ర్చ‌

రేప‌టి నుండి అంటే గురువారం నుండి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా గురువారం ఉద‌యం 9 గంట‌లకు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానుండ‌గా… శాస‌న మండ‌లి సమావేశాలు ఉద‌యం 10 గంట‌ల నుంచి ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు కొన‌సాగ‌నున్న ఈ స‌మావేశాల్లో భాగంగా తొలి రోజే 3 రాజ‌ధానుల‌కు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు.. దానిపై చర్చతో పాటుగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌సంగించనున్నట్టు సమాచారం. 3 రాజ‌ధానుల‌పై ఆయ‌న ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లుగా వైసీపీ వ‌ర్గాలు పేర్కొన్నాయి.మ‌రి మూడు రాజ‌ధానుల‌పై వైసీపీ స‌ర్కార్ ఏం నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement