Saturday, April 27, 2024

మే 5న రామ‌బాణం.. పోస్ట‌ర్ రిలీజ్ చేసిన మేక‌ర్స్

హీరో గోపీచంద్ దర్శకుడు శ్రీవాస్‌తో రామబాణం సినిమా చేస్తున్నాడు. తాజాగా చిత్రబృందం సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాను మే 5న రిలీజ్‌ చేస్తున్నట్లు పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌లో బాగా చదవండి. పరీక్షలు ఇంకా బాగా రాయండి. వేసవి సెలవుల్లో కలుద్దాం.. అంటూ కాప్షన్‌ను ఇచ్చారు. యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపిచంద్‌కు జోడీగా డింపుల్‌ హయతి నటిస్తుంది. జగతిబాబు, ఖుష్భూ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అటు గోపిచంద్‌కు, ఇటు శ్రీవాస్‌కు ఇద్దరికి హిట్టు చాలా అవసరం. శ్రీవాస్‌ కూడా గతకొంత కాలంగా లైమ్‌లో లేడు. లౌక్యం తర్వాత ఆయన తెరకెక్కించిన డిక్టేటర్‌, సాక్ష్యం డిజాస్టర్‌లుగా మిగిలాయి. మరీ ఈ సినిమాతో అయినా వీరిద్దరూ గట్టెక్కుతారో లేదో.

Advertisement

తాజా వార్తలు

Advertisement