Tuesday, May 7, 2024

చికోటిని కలిసిన రామ్ గోపాల్ వర్మ..మరో బయోపిక్ తెరకెక్కనుందా..

బయోపిక్ లు తీయడంలో దిట్ట ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.ఫ్యాక్షన్ సినిమాలను కేరాఫ్ గా నిలిచే రాంగోపాల్ వర్మ త్వరలోనే చికోటిపై సినిమా తీసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కన్పిస్తోంది. ఇందులో భాగంగానే ఆర్జీవీ ఆయనను కలిసి చర్చించినట్లు వినికిడి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా వైల్డ్ మ్యాన్ గా గుర్తింపు పొందిన చికోటి ప్రవీణ్ ను కలిశారు. తన ఫామ్ హౌస్ లోని అన్యదేశ జంతువుల సేకరణను తిలకించారు. అనంతరం కొద్దిసేపు చీకోటి ప్రవీణ్ తో కలిసి పలు విషయాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ను ఆర్జీవీ స్వయంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇటీవల క్యాసినో.. హవాలా రూపంలో డబ్బుల పంపిణీకి సంబంధించిన విషయంలో ఈడీ అధికారులు చీకటి ప్రవీణ్ ను విచారించారు. ప్రవీణ్ కి రాజకీయ నాయకులు సెలబ్రటీలతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఆయన నుంచి కీలక సమాచారం సేకరించారని తెలుస్తోంది.ఈ వ్యవహారంపై తనను కావాలని ఎవరైనా ఇరికిస్తే అందరి బండారం బయట పెడుతారనని చికోటి ప్రవీణ్ హెచ్చరించినట్లు ఓ వీడియో అప్పట్లో వైరల్ అయింది. అయితే ఈ వీడియో తనది కాదని ఆయన ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆర్జీవీ చికోటిని కలవడంతో వైల్డ్ మ్యాన్ బయోగ్రఫీపై ఆర్జీవీ సినిమా చేయబోతున్నారా అనే టాక్ నడుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement