Wednesday, May 15, 2024

ర‌జ‌నీకాంత్ ని క‌లిసిన లారెన్స్ – చంద్ర‌ముఖి2 మూవీ షూటింగ్ స్టార్ట్

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ని క‌లిశారు మ‌రో న‌టుడు రాఘ‌వా లారెన్స్..చంద్ర‌ముఖి చిత్రానికి సీక్వెల్ గా చంద్రముఖి 2 ని అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్న సందర్భంగా తలైవా ఆశీర్వాదం తీసుకున్నారు. చంద్రముఖి 2’ కాస్ట్ అండ్ క్రూ సెటప్ ముగియడంతో చిత్ర యూనిట్ షూటింగ్ కు సిద్ధమైంది. తొలి షెడ్యూల్ ను కర్ణాటకలోని మైసూర్ లో చిత్రీకరించనున్నారు. ఇక్కడే 15 రోజుల పాటు రెగ్యూలర్ షూట్ జరగనుందట‌. షూటింగ్ ప్రారంభం పట్ల రాఘవా లారెన్స్ నే అఫిషియల్ గా ట్వీటర్ లో అనౌన్స్ చేశారు. రజనీకాంత్ బ్లెసింగ్స్ తీసుకుంటున్న పిక్స్ ని పంచుకున్నారు. ఈ సీక్వెల్ లో రజనీకాంత్ పాత్రను రాఘవ లారెన్స్ పోషిస్తుండటం పట్ల అభిమానులు ఎగ్జైట్ ఫీలవుతున్నారు. ఇప్పటికే రాఘవా ముని, కాంచన, గంగ వంటి హర్రర్ చిత్రాలతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా కామెడీని పండించగల కెపాసిటీ ఉన్న నటుడు కావడంతో మేకర్స్ రాఘవను ఎంచుకున్నారు. రాఘవ పాత్రకు సపోర్టింగ్ గా ప్రముఖ కమెడియన్ వడివేలు నటిస్తున్నారు. హీరోయిన్లుగా త్రిష, లక్ష్మీ మీనన్, అనుష్క శెట్టి పేర్లు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement