Wednesday, December 6, 2023

Rajasthan – మూడో తేది త‌ర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ క‌నుమ‌రుగు – మోడీ

భ‌ర‌త్ పూర్ – రాజ‌స్థాన్ – దేశాన్ని స‌ర్వ‌నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి అంతిమ రోజులు స‌మీపించాయ‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు.. డిసెంబర్ 3వ తేదీ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ దేశంలో మాయమైపోవడం ఖాయం అని వ్యాఖ్యానించారు.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం భరత్ పూర్‌లో జ‌రిగిన సభలోమాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్‌పై ధ్వజమెత్తారు. అవినీతి, అల్లర్లు, నేరాల పట్ల రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని బుజ్జగింపు ధోరణని విధానాలతో నేరస్థులకు స్వేచ్ఛనిస్తోందని దుయ్యబట్టారు.

- Advertisement -
   

కాంగ్రెస్ పార్టీ తన స్వలాభం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టేందుకు సైతం వెనుకాడదని మండి ప‌డ్డారు. కాంగ్రెస్ పాలనలో రాళ్ల దాడి, కర్ఫ్యూ, అల్లర్ల కారణంగా రాజస్థాన్ ప్రజలు హోలీ, రామనవమి, హనుమాన్ జయంతి మరే ఇతర పండుగను శాంతియుతంగా జరుపుకోలేకపోయారన్నారు. దీంతో రాజ‌స్థాన్ ప్ర‌జ‌లు కాంగ్రెస్ ను ఇంటికి సాగ‌నంపేందుకు సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement