Sunday, April 28, 2024

ఇవాళ, రేపు వర్షాలు..

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తారు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ములుగు జిల్లా కాశిందేవిపేటలో నిన్న అత్యధికంగా 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, తెలంగాణపై రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే, ఉత్తర భారతదేశం వైపు నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: నీరజ్ చోప్రాకు ప్రశంసల వెల్లువ.. గోల్డెన్ బాయ్ కి రూ.6 కోట్ల నజరానా

Advertisement

తాజా వార్తలు

Advertisement