Sunday, April 14, 2024

నేడు బీఎస్పీలో చేరనున్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్..

మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ నేడు బహుజన సమాజ్ పార్టీలో చేరనున్నారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు బీఎస్పీ పార్టీలో అధికారికంగా చేరుతున్నారు. నల్గొండలో ఏర్పాటు చేస్తున్న రాజ్యాధికార సంకల్ప సభలో ప్రవీణ్ బీఎస్పీ నాయకుల సమక్షంలో పార్టీలో చేరతారు. ఈ సభకు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ ముఖ్య అతిథిగా హాజరు కానుండగా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ఈ సంకల్ప సభకు లక్ష మందికిపైగా బహుజన ఉద్యమకారులు, స్వేరో సంస్థ కార్యకర్తలు హాజరు కానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

మాజీ ఐపీఎస్‌ ఆర్.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌కౌంటర్‌ స్పెష్టలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వ గురుకులాల్లో మంచి పట్టు సాధించి ఎవ్వరు ఊహించని విధంగా రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే తాను ఏ రాజకీయ పార్టీలో చేరట్లేదని బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండటానికే పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: బిగ్ బాస్5 @జాంబిరెడ్డి నటి

Advertisement

తాజా వార్తలు

Advertisement