Tuesday, May 14, 2024

తూర్పు భారత్‌లో వర్షాలు.. వాతావరణ విభాగం సూచన

వచ్చే 24 గంటల్లో బీహార్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, సిక్కిమ్‌, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఆదివారం సూచించింది. తూర్పు భారత్‌లో పిడుగులు, ఉరుములతో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా ప్రాంతం, రాయలసీమలో, తెలంగాణ, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తాజా బులెటిన్‌లో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement