Wednesday, December 6, 2023

ఆస్తుల జప్తునకు ఎన్‌ఐఏ రెఢీ.. 19 మంది ఖలిస్తాన్‌ టెర్రరిస్టుల జాబితా సిద్ధం

ఖలిస్తాన్‌ టెర్రరిస్టు, నిషేధిత సిఖ్‌ ఫర్‌ జస్టిస్‌ వేర్పాటువాద సంస్థ చీఫ్‌ గురుపత్‌వంత్‌ సింగ్‌ పన్నున్‌ ఆస్తులను స్వాధీనం చేసుకున్న జాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్‌ఐఏ).. యూకే, అమెరికా, కెనడా, దుబాయ్‌, పాకిస్తాన్‌, తదితర దేశాల్లో నివసిస్తున్న ఖలిస్తానీ టెర్రరిస్టులకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి సమాయత్తమవుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ మేరకు 19 మంది టెర్రరిస్టులతో కూడిన జాబితాను ఎన్‌ఐఏ సిద్ధం చేసింది. చట్ట వ్యతిరేక కార్యాకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటుంది. జాబితాలోని టెర్రరిస్టులు విదేశాల నుంచి భారత్‌ వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నారనే అభియోగాలను ఎదుర్కొంటున్నారు.

- Advertisement -
   

టెర్రరిస్టుల జాబితా..

పరమ్‌జిత్‌ సింగ్‌ పమ్మ(యూకే), వాధ్వా సింగ్‌ బబ్బర్‌ అలియాస్‌ చాచా(పాకిస్తాన్‌), కుల్వంత్‌ సింగ్‌ ముథ్రా(యూకే), జే ధిలావల్‌(అమెరికా), సుఖ్‌పాల్‌ సింగ్‌(యూకే), హర్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ రానా సింగ్‌(యూఎస్‌), సరబ్‌జిత్‌ సింగ్‌ బెన్నూర్‌(యూకే), కుల్వంత్‌ సింగ్‌ అలియాస్‌ కుంటా(యూకే), హర్‌జప్‌ సింగ్‌ అలియాస్‌ జప్పీ సింగ్‌(యూఎస్‌), రంజిత్‌ సింగ్‌ నీతా(పాకిస్తాన్‌), గుర్మీత్‌ సింగ్‌ అలియాస్‌ బగ్గా అలియాస్‌ బాబా(యూకే), గురుప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ బాఘీ(యూకే), జస్మీత్‌ సింగ్‌ హకీమ్‌జాదా(దుబాయ్‌), గురుజంత్‌ సింగ్‌ థిల్లాన్‌(ఆస్ట్రేలియా), లఖ్‌బీర్‌ సింగ్‌ రోడె (ఐరోపా, కెనడా), అమర్‌దీప్‌ సింగ్‌ పూరేవాల్‌(యూఎస్‌), జతీందెర్‌ సింగ్‌ గ్రేవాల్‌(కెనడా), దుపీందర్‌ జీత్‌(యూకే), ఎస్‌ హిమ్మత్‌ సింగ్‌(యూఎస్‌).

Advertisement

తాజా వార్తలు

Advertisement