Saturday, April 27, 2024

హైదరాబాద్‌లో మరోసారి వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ..

తెల్లవారుజామున ఆహ్లాదకరమైన గాలులతో కూడిన వాతావరణాన్ని చవిచూసిన హైదరాబాద్ నగరం.. సాయంత్రం వేల‌లో మేఘావృత్త‌మై క‌నిపించింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈ రోజు మధ్యాహ్నం తెలిపింది. అయితే సాయంత్రం వేల‌లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, మేడ్చల్, నారాయణపేట, ఆదిలాబాద్, మంచిర్యాలతో సహా నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, జనగాం, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతే కాకుండా ఐఎండీ- రాష్ట్రంలో ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది, కొన్ని ప్రదేశాలలో మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉన్న‌ట్టు తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement