Sunday, April 28, 2024

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాన్ని అనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. అది ఇవాళ వాయుగుండగా మారే సూచనలున్నాయని అధికారులు పేర్కొన్నారు. మరింత బలపడిన సోమవారం నాటికి తుఫానుగా మారుతుందని, ఈ నెల 25వ తేదీకి తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వాయువ్య దిశగా ప్రయాణించి 26న ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement