Thursday, May 2, 2024

జోరుతగ్గని బుట్ట‌బొమ్మ సాంగ్..60 కోట్ల వ్యూస్..400 మిలియ‌న్ లైక్స్

అల వైకుంఠ‌పుర‌ములోని బుట్ట‌బొమ్మ సాంగ్ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు..సినిమా రిలీజ్ అయి ఏడాది దాటిపోయిన ఈ పాట ఇప్పటికీ రికార్డులు క్రియేట్ చేస్తుండ‌డం విశేషం. ఈ చిత్రానికి థ‌మ‌న్ స్వ‌రాలు అందించ‌గా, ఇందులోని ప్ర‌తి పాట శ్రోత‌ల‌ను ఎంత‌గానో అల‌రించింది. బుట్ట‌బొమ్మ సాంగ్ రీసెంట్‌గా యూట్యూబ్​లో 601 మిలియన్ల(60 కోట్ల) వీక్షణలు సాధించిన తొలి తెలుగు పాటగా రికార్డు నెలకొల్పింది. తాజాగా ఈ సాంగ్‌కు యూ ట్యూబ్‌లో 400 మిలియ‌న్ లైక్స్ రాగా, తెలుగులో ఇలాంటి ఘ‌న‌త సాధించిన తొలి తెలుగు పాట‌గా రికార్డ్ నెల‌కొల్పింది. బుట్ట‌బొమ్మ సాంగ్స్ సాధిస్తున్న రికార్డ్స్ ప‌ట్ల అభిమానుల‌తో పాటు చిత్ర బృందం సంతోషం వ్య‌క్తం చేస్తుంది. ప్ర‌స్తుతం బ‌న్నీ.. పుష్ప సినిమాతో బిజీగా ఉండ‌గా, ఈ చిత్రాన్ని సుకుమార్ తెర‌కెక్కిస్తున్నారు. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement