Thursday, May 2, 2024

ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు.. డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి..

రుతుపవనాల ప్రభావంతో గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్బపీడన ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో నిన్న భారీగా వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలకు సామర్లకోటలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న ఉదయం నుంచి జిల్లాలో 747 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు,అత్యధికంగా కోటనందూరు మండలంలో 64 మిల్లీమీటర్లు నమోదైంది. భారీ వర్షానికి కుమ్మరి వీధి డ్రైనేజీలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి నీటిలో పడి కొట్టుకుపోయారు. డ్రైనేజీ సమీపంలో మృతదేహాన్ని గుర్తించి విచారణ చేపట్టిన పోలీసులు.

ఇది కూడా చదవండి: ఇంగ్లాండ్‌కు చుక్కెదురు..యూరో కప్ విజేత ఇటలీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement