Sunday, April 28, 2024

తెలంగాణ‌కు వ‌ర్ష సూచ‌న‌.. ఆ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు..!

తెలంగాణ‌లోని పలు జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, హైదరాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్‌, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, నిజామాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నదని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement