Friday, May 3, 2024

‘సినతల్లి’కి ఇల్లు నిర్మించి ఇస్తా..’రాఘవ లారెన్స్’

దర్శకుడు జ్ఞానవేల్‌పై ప్రశంసలు కురిపించారు ప్రముఖ దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ . ఆయనను మనసారా అభినందిస్తున్నట్టు ట్వీట్ చేశారు. 28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ప్రముఖ నటుడు సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా దేశవ్యాప్తంగా హిట్ టాక్ సంపాదించుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. తాజాగా ఈ సినిమాపై లారెన్స్ స్పందించారు. . చేయని నేరానికి చిత్రహింసలకు గురై మృతి చెందిన రాజాకన్ను కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పారు. ఆయన భార్య పార్వతమ్మ (సినతల్లి)కి ఇల్లు కట్టి ఇస్తానని హామీ ఇచ్చారు. పార్వతమ్మ పోరాటాన్ని చూసి తాను ఆశ్చర్యపోయినట్టు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement