Sunday, April 28, 2024

రాధేశ్యామ్ ‘ఫ‌స్ట్ సింగిల్’..ఎప్పుడంటే..

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప‌లు భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. స‌లార్, ఆదిపురుష్ చిత్రాల‌తో పాటు రాధేశ్యామ్ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం నుండి అప్ డేట్ రాలేద‌ని మ‌న‌స్థాపంతో రీసెంట్ గా ఓ అభిమాని సూసైడ్ లెట‌ర్ కూడా రాశాడు. కాగా గ‌త రెండు రోజుల నుంచి రాధేశ్యామ్ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. కానీ ఈ మూవీ టీం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఎట్టకేల‌కు ఈ చిత్ర బృందం న‌వంబ‌ర్ 15 సాయంత్రం 5గం.ల‌కు ఈ రాత‌లే అంటూ సాగే పాట‌ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు తెలిపారు. ఈ పాట శ్రోత‌ల‌కి మంచి వినోదం పంచుతుంద‌ని తెలుస్తుంది. ‘రాధేశ్యామ్’ సినిమాకి హిందీ వర్షన్ లో మిథూన్, మనన్ భరద్వాజ్ లు కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక సౌత్ లాంగ్వేజెస్ లో జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

తాజాగా మనన్ భరద్వాజ్ తన ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశారు. ఎన్నో నిద్ర లేని రాత్రులు, ఎడిటింగ్స్, రికార్డింగ్స్, సంవత్సరాలుగా సహనం.. ఫైనల్ గా తమ హానెస్ట్ అటెంప్ట్ ‘రాధేశ్యామ్’ మ్యూజిక్ ని ప్రెజెంట్ చేసే సమయం వచ్చింది అని పోస్ట్ చేశాడు. అంతే కాక మీరందరు ఇది తొందరగా వినాలి అని పోస్ట్ చేశాడు. దీంతో సాంగ్స్‌పై అంద‌రిలో ఆస‌క్తి పెరిగింది. రాధేశ్యామ్ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. క‌రోనా వ‌ల‌న ఈ మూవీ ప‌లుమార్లు వాయిదా ప‌డింది. ప్ర‌భాస్ కి జోడీగా పూజాహెగ్డే న‌టిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్..రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం..ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement