Sunday, April 28, 2024

Photo Story: ల‌వ్‌లీ ఫ్రెండ్స్.. గ్రేట్ రైడింగ్..

జాతి లేదు.. వైరం లేదు.. మూగ జీవాలు మాత్రం ఎంచ‌క్కా క‌లిసిపోయి జీవ‌నం సాగిస్తుంటాయి. కానీ, జంతువుల్లో తెలివైన మ‌నిషులు మాత్రం కులం, మతం, జాతి అంటూ కొట్టుకుచ‌స్తున్నారు. కొంత‌మంది అయితే అదే ప‌నిగా జాతి వైష‌మ్యాలు రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

కానీ, ఆనంద్ ధ‌ర్మాన తీసిన ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఒక కోతిపిల్ల‌.. పెట్ డాగ్‌పై రైడ్ చేస్తూ ఇందిరాపార్క్ ద‌గ్గ‌ర క‌నిపించింద‌ని, చూడ ముచ్చ‌ట‌గా ఉండ‌డంతో క్యాప్చ‌ర్ చేసిన‌ట్టు పేర్కొంటూ… హాయ్ హైద‌రాబాద్ ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. య‌హ్ దోస్తీ హ‌మ్ న‌హీ తోడేంగే.. ట్యాగ్‌లైన్ కూడా ఇచ్చారు. ఇప్పుడిది అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.. ఈ ఫోటో చూసిన చాలామంది సోష‌ల్ మీడియాలో లైకులు, కామెంట్ల‌తో షేర్ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement