Monday, April 29, 2024

‘పుష్ప’ నుండి ‘సునీల్’ ఫ‌స్ట్ లుక్..విల‌న్ లుక్ అదుర్స్..

పాన్ ఇండియా మూవీ పుష్ప‌..ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు సుకుమార్. ఈ మూవీలో హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్నాడు. ఆయ‌న‌కి జోడీగా ర‌ష్మిక‌మంద‌న న‌టిస్తోంది. కాగా న‌టుడు సునీల్ ‘మంగళం శ్రీను’ అనే పాత్రలో న‌టించాడు. ఆయ‌న ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ లుక్ లో ఎర్ర‌ని క‌ళ్లు, చేతికి ఉంగ‌రాల‌తో సునీల్ ఫోనులో మాట్లాడుతున్న‌ట్లు క‌న‌ప‌డుతున్నాడు. ఈ లుక్ లో సునీల్ భ‌యంక‌రంగా క‌నిపిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఫాహద్ ఫాజిల్ లా విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నట్లు తెలుస్తోంది. విల‌న్ పాత్ర‌ల్లో న‌టించాల‌ని ఉంద‌ని గ‌తంలోనూ సునీల్ చాలా సార్లు చెప్పాడు. డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement