Saturday, April 20, 2024

స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

దీపావళి పండుగ అనంతరం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పలు రాష్ట్రాలు ట్యాక్స్ ను తగ్గించడంతో చమరు ధరలు మరింతగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.97 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెట్రో ధరల్లో మార్పు లేదు. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.41గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.15గా ఉంది. ఇక, లీటర్ డీజిల్ ధర రూ.96.25గా ఉంది. కాగా, పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించినా.. తెలుగురాష్ట్రాలు ఎందుకు తగ్గించడం లేదంటూ ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement