Friday, April 26, 2024

అంచనాలకు మించి ధాన్యం కొనుగోళ్లు.. 80శాతం కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈ ఏడాది ఖరీఫ్‌లో అంచనాలకు మించి ధాన్యాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఈసారి అధికవర్షాలు, వరిని దోమ, వివిధ తెగుళ్లు ఆశించడంతో దిగుబడి తగ్గింది. మరోవైపు రైతులు తమకుటుంబ అవసరాల కోసం పెద్ద ఎత్తున సన్నరకం వరిని సాగు చేశారు. ఈ నేపథ్యంలో ప్రయివేటు వ్యాపారులకు అమ్ముకోగా దాదాపు 50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేయగా… ఏకంగా 60లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది. మరో రెండు, మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దాకా కొనుగోలు కేంద్రాల్లో ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 80శాతం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాగా వాటిని మూసివేశారు. ఈ ఖరీఫ్‌లో 7011 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇప్పటికే 4700 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి.

ఇప్పటి వరకు అధికారికంగా 60లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశారు. దాదాపు 12051 కోట్ల విలువైన ధాన్యాన్ని వానాకాలంలో రైతుల నుంచి కొనుగోలు చేయగా అందులో 11వేల కోట్ల మేర చెల్లింపులు పూర్తయ్యాయి. నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 6లక్షల మెట్రిక్‌ టన్నులు, కామారెడ్డిలో 5లక్షల మెట్రిక్‌ టన్నులు, నల్గొండలో 4 లక్షల మెట్రిక్‌ టన్నులు అత్యధికంగా సేకరించారు. అత్యల్పంగా ఆదిలాబాద్‌, గద్వాల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో కొనుగోళ్లు జరిగాయి.

రాష్ట్రంలో వానాకాల (ఖరీఫ్‌) ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మరో నాలుగైదు రోజుల్లో ధాన్యం రాష్ట్ర అన్ని వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లు పూర్తి కానున్నాయి. ఖరీఫ్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రా, బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు అధికారులు తరలించారు.

కలిసివచ్చిన గత అనుభవం…

- Advertisement -

ప్రస్తుత ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి సదుపాయాల పరంగా పెద్దగా ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లూ పూర్తి కావొచ్చాయి. దాదాపు మూడేళ్లుగా రైతులు పండించిన ఖరీఫ్‌, రబీ ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఆ అనుభవాల నేపథ్యంలో ఈసారి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకండా, వర్షాలు వెంటాడుతున్నా గన్నీల కొరత రాకుండా, ధాన్యం తడవకుండా పాలిథిన్‌ కవర్లు, ప్యాడీ క్లీనర్లు , కాంటా అయ్యాక ఒకటి, రెండు రోజుల్లోనే ధాన్యాన్ని మిల్లులకు తరలించే విధంగా పక్కాగా ఏర్పాట్లు చేయడంతో కొనుగోళ్ల ప్రక్రియ సులువుగా పూర్తికావొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement