Wednesday, May 8, 2024

పులసా ..మజాకా..రెండు కిలోలు రూ.20వేలు

పులస చేప గురించి అందరికీ తెలిసిందే. అతి ఖరీదైన చేపగా దీనికి పేరుంది. గోదావరి నదిలో ఎదురు ఈదే ఈ చేపకి యమా డిమాండ్. అంతేకాదు, పుస్తెలు అమ్మి అయినా పులస తినాలని చెబుతారు. జాలర్ల వలలో ఒక్క చేప పడినా వారి పంట పండుతుంది. దానిని కొనుగోలు చేసేందుకు వందలాదిమంది క్యూకడుతుంటారు. ఏ ఒక్కరికో దానిని అమ్మలేక వేలం పాటలు నిర్వహిస్తుంటారు.  గోదావరి వరద ఉద్ధృతి తగ్గడంతో మత్స్యకారులకు పులస చేపలు చిక్కుతున్నాయి. దీంతో యానాం మార్కెట్లో వాటి విక్రయాలు మొదలయ్యాయి. రెండు కిలోల పులస చేపకు వేలం పాట నిర్వహిస్తే కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ. 19 వేలకు నాటి పార్వతి అనే మహిళ ఈ చేపను దక్కించుకుని, అనంతరం భైరవపాలేనికి చెందిన వ్యక్తికి దానిని రూ. 20 వేలకు అమ్మేశారు.  ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ధరని మత్స్యకారులు తెలిపారు. ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ వద్ద ఇసుక మేటలు వేయడం వల్ల సముద్రంలోంచి గౌతమి పాయలోకి పులసలు చాలా తక్కువగా వస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస’ చేప అంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement