Friday, April 26, 2024

ఆర్ ఆర్ ఆర్ బృందానికి ప్రియాంకా చోప్రా విందు..

అస్కార్ బ‌రిలో నిలిచిన ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందంతో పాటు దక్షిణాసియా చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులకు ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చారు గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంకా చోప్రా.. ఆమెరికాలోని లాస్ ఏంజెల్స్ జరిగిన ఈ బ్ర‌హ్మండ‌మైన విందులో రామ్ చర‌ణ్ దంప‌తులు, రాజ‌మోళి, ఎం ఎం కీర‌వాణి, తార‌క్,రాహుల్ సిప్లిగంజ్, త‌దిత‌రులు పాల్గొన్నారు.. అలాగే ప్రీతిజింతా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా హాజ‌ర‌య్యారు..కాగా,ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయింది. ఈ నెల 12వ తేదీన (భారత్ లో 13) లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్‌‌ లో అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఈ పార్టీ సందర్భంగా ప్రియాంక చోప్రాతో కలిసి రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఫొటో దిగారు. దీన్ని ట్విట్టర్ లో షేర్ చేసిన ఉపాసన ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. హాలీవుడ్ లో ఎల్లప్పుడూ తమ కోసం బాసటగా ఉన్న ఆమెకు థ్యాంక్స్ చెప్పారు. ఈ ఫోటోను ఉపాస‌న త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement