Monday, April 29, 2024

‘పృథ్వీ-2 బాలిస్టిక్’ క్షిపణి ప్ర‌యోగం స‌క్సెస్

చండీపూర్ – ఒడిశా – భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. దేశీయంగా అభివృద్ధి చేసిన బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ని గ‌త‌ రాత్రి ఒడిశాలోని చండీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. పృథ్వీ-2 క్షిపణి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని రక్షణ శాఖ తెలిపింది. పృథ్వీ-2 ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి . ఈ క్షిప‌ణి .350 కి.మీ. రేంజ్‌లోని లక్ష్యాలను ఛేదిస్తుంది. స్ట్రాప్ డౌన్ సీరియల్ నావిగేషన్ సిస్టమ్‌పై నడిచే ఈ క్షిపణి 500 కిలోల వరకు పేలు పదార్థాలను మోసుకెళ్లగలుగుతాయి. ఈ క్షిపణి పరీక్ష సక్సెస్ కావటంతో భారత ఆర్మీలోకి మరో శక్తివంతమైన అస్త్రం చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement