Wednesday, May 15, 2024

ప్ర‌పంచంలోనే అతి పెద్ద హాకీ స్టిక్.. రూపొందించిన సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్

ప్ర‌పంచంలోనే అతి పెద్ద హాకీ స్టిక్ ను ఇసుక‌తో రూపొందించారు ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి.. సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్. ఈ హాకీ స్టిక్ కోసం 5,000 హాకీ బాల్స్, ఐదు టన్నుల ఇసుకను ఆయన వినియోగించారు. 15 మంది విద్యార్థుల సాయంతో రెండు రోజుల్లో ఆయన దీన్ని నిర్మించారు. 105 అడుగుల పొడవున్న ఈ హాకీ స్టిక్ ప్రపంచంలోనే పెద్దదిగా పట్నాయక్ ప్రకటించారు. కటక్ లోని మహానంది నదీ తీరంలో ఈ హాకీ స్టిక్ ను తీర్చిదిద్దారు. 2023 పురుషుల ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ కు ఒడిశా ఆతిథ్యమిస్తోంది. భువనేశ్వర్ లో కళింగ స్టేడియం, అలాగే రూర్కెలాలోని బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం మ్యాచ్ లకు వేదికగా నిలవనున్నాయి. ఈ నెల 13 నుంచి 29 వరకు పోటీలు ఉంటాయి. ఇందుకు సంబంధించి కటక్ లో కర్టెన్ రైజర్ కార్యక్రమం బుధ‌వారం సాయంత్రం జరగనుంది. ఈ ప్రపంచ కప్ నేపథ్యంలో సుదర్శన్ పట్నాయక్ తన సైకత కళతో చక్కని హాకీ స్టిక్ రూపొందించడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement