Saturday, May 8, 2021

ఓటీటీలో విడుదల కానున్న ప్రభాస్ ‘రాధేశ్యామ్’

క‌రోనా ప‌రిస్థితుల‌లో చాలా మంది సినిమా అభిమానులు ఓటీటీపై మ‌క్కువ చూపిస్తున్నారు. థియేటర్స్ తెర‌వ‌క‌పోవ‌డం, ఓపెన్ చేసిన క‌రోనా వ‌ల‌న వెళ్ల‌లేని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో ఓటీటీనే బెస్ట్ ఆప్ష‌న్ అనుకుంటున్నారు. ఇక నిర్మాత‌లు సైతం రిలీజ్‌కు సిద్దంగా ఉన్న సినిమాల‌ను పెండింగ్ పెట్టడం ఇష్టం లేక ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు.

ప్ర‌భాస్- పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన రాధే శ్యామ్ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్నార‌ని ప్ర‌చారం నడుస్తోంది. జూలై 30న రాధే శ్యామ్ మూవీని థియేట‌ర్‌లో విడుద‌ల చేస్తాం అని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కాని ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తే ఆ స‌మ‌యానికి థియేట‌ర్స్ తెర‌వ‌డం క‌ష్టంగానే అనిపిస్తుంది. ఈ క్ర‌మంలో ‘రాధేశ్యామ్’ సినిమాను పే పర్ వ్యూ విధానంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. కాగా పే పర్ వ్యూ విధానంతో సల్మాన్ ఖాన్ ‘రాధే’ సినిమాను మే 13న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Prabha News