Wednesday, April 17, 2024

ప్లాస్మా డొనేట్‌ చేయండి: చిరంజీవి ట్వీట్..

కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని చిరంజీవి పిలుపునిచ్చారు. కొవిడ్‌ సెకండ్ వేవ్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్న చిరంజీవి…కొవిడ్‌ వారియర్స్‌ ప్లాస్మాను దానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ట్విట్టర్‌ వేదికగా కొవిడ్‌ వారియర్స్‌ ప్లాస్మాను దానం చేయాలన్నారు చిరంజీవి. “కొవిడ్ సెకండ్‌ వేవ్‌ చాలా మందిపై ప్రభావం చూపుతుందనే సంగతి మీ అందరికీ తెలిసిందే. కొన్నిరోజుల ముందు మీరు కొవిడ్‌ నుంచి కోలుకుని ఉంటే, మీ ప్లాస్మాను దానం చేయండి. దీని కారణంగా మరో నలుగురు కొవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోగలరు. వివరాల కోసం, గైడెన్స్‌ కోసం చిరంజీవి చారిట్రబుల్ ట్రస్ట్‌ను సంప్రదించాలని కోరుతున్నాను” అంటూ ట్రస్ట్‌ నెంబర్‌ను ట్వీట్ చేశారు చిరంజీవి.

Advertisement

తాజా వార్తలు

Advertisement