Wednesday, July 28, 2021

ఫోర్న్ రాకెట్ కేసు..శిల్పాశెట్టికి క్లీన్ చిట్..

బాలీవుడ్ లో ప్రకంపనలు రేపిన ఫోర్న్ రాకెట్ కేసులో శిల్పాశెట్టికి క్లీన్ చిట్ లభించింది. శిల్పాశెట్టి భర్త వ్యాపారవెత్త ఫోర్న్ రాకెట్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే.. అయితే ఈ రాకెట్లో శిల్పిశెట్టి పాత్రపై సందహాలు ముంబై పోలీసులు తెరదించారు. రాజ్ కుంద్రా కేసులో అత‌డి భార్య‌ శిల్పాశెట్టి పాత్ర ఎంత‌వ‌ర‌కు ఉంద‌నే దానిపై నెటిజ‌న్లు సైతం ప్ర‌శ్న‌లు లేవెనెత్తుతున్నారు. అయితే ఈ కేసు నుంచి శిల్పాశెట్టికి ఊర‌ట ల‌భించింది. ఈ కేసులో శిల్పాశెట్టికి ముంబై పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. శిల్పాశెట్టికి సంబంధం లేకుండానే రాజ్ కుంద్రా వ్య‌వ‌హారం కొన‌సాగింద‌ని, యూకేకు చెందిన యాప్ అండ‌దండ‌ల‌తోనే రాజ్ కుంద్రా పోర్న్ ఫిలిమ్స్ వ్య‌వ‌హారం న‌డిపించాడ‌ని ఇప్ప‌టివ‌ర‌కున్న స‌మాచారం. ఇక శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ప్రస్తుతం ముంబై జైలులో పోలీసుల కస్టడీలో ఉన్నాడు.. రాజ్ కుంద్రాను రేపు కోర్టు ఎదుట ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. రాజ్ కుంద్రా కేసులో రోజుకో విష‌యం వెలుగులోకి వ‌స్తుండ‌టంతో చాలా ర‌కాల ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. మ‌రోవైపు పోర్న్ కేసులో అరెస్టైన‌ రాజ్‌కుంద్రా ముంద‌స్తు బెయిల్ కోసం అర్జీ పెట్టుకున్నాడు.

ఇది కూడా చదవండి : హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్లు..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News