Thursday, March 28, 2024

దివ్యాంగులకు బైకులు: కేటీఆర్ బర్త్ గిఫ్ట్

తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్​లో భాగంగా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్రవాహనాలను అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గతేడాది గిఫ్ట్ ఏ స్మైల్​లో భాగంగా ఆరు అంబులెన్స్​లను విరాళంగా ఇచ్చానన్న కేటీఆర్​… టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు మొత్తంగా 90 అంబులెన్స్​లను విరాళం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీన తన జన్మదినం సందర్భంగా అవసరం ఉన్న వారికి వ్యక్తిగతంగా సాయం అందించాలని కోరారు. అదే రోజున నిర్వహిస్తోన్న ముక్కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలని తెరాస నేతలు, అనుచరులు, అభిమానులకు కేటీఆర్​ పిలుపునిచ్చారు. తన జన్మదినం రోజున బొకేలు, కేకులు, హోర్డింగుల కోసం వృథాగా డబ్బు ఖర్చు చేయవద్దని కేటీఆర్ సూచించారు.

మంత్రి కేటీఆర్​ పుట్టినరోజు సందర్భంగా తాము కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని టీఆర్ఎస్ నేతలు ముందుకొచ్చారు. తాను కూడా 50 మంది దివ్యాంగులకు ద్విచక్రవాహనాలు అందిస్తానని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ తెలిపారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్​ కుమార్​ కూడా తన వంతుగా 20 ద్విచక్రవాహనాలను దివ్యాంగులకు అందిచనున్నట్లు తెలిపారు. కేటీఆర్​ అడుగుజాడల్లోనే తాము కూడా పయనిస్తూ.. తన శక్తి మేరకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తానని ప్రకటించారు. ఇక ఎమ్మెల్సీ శింభీపూర్ రాజు కూడా 60 బైకులను ఉచితంగా అందిస్తానని చెప్పారు.

ఇది కూడా చదవండి: రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ను తాకిన వరదనీరు

Advertisement

తాజా వార్తలు

Advertisement