Friday, May 3, 2024

“పొన్నియిన్ సెల్వన్” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. విడుద‌ల తేది ఖ‌రారు చేసిన మేక‌ర్స్

నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది.! మణిరత్నం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ పీరియాడికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించే ఈ సినిమాకి ఆయన కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ సినిమా చోళరాజుల కాలానికి సంబంధించిన కాలంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన .. దాని చుట్టూ అల్లుకున్న కథ. 10వ శతాబ్దం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్, విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, శరత్‌కుమార్, రెహమాన్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషింస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు మేక‌ర్స్. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్లను విడుదల చేశారు. ప్రధానమైన పాత్రల లుక్ చూస్తుంటేనే ఈ సినిమాపై మరింతగా ఆసక్తి పెరిగిపోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement