Sunday, April 28, 2024

యుపీలో ప్రజా జీవనానికి పొంచి ఉన్న ప్రమాదం.. ఆయువుపై కాలుష్యపు పంజా!

దేశంలోని మానవ ఆరోగ్యానికి కాలుష్యం అతిపెద్ద ముప్పుగా పరిణమించబోతోంది. ప్రస్తుతం వున్న వాయు కాలుష్య స్థాయిలు ఇలాగే కొనసాగితే ఉత్తర భారతంలోని 500 మిలియన్ల మందికి పైగా వారి ఆయుర్దాయంలో 6-7 సంవత్సరాలు నష్టపోతారని ఒక అధ్యయనం పేర్కొంది. అలాగే వార్షిక సగటు కాలుష్య స్థాయిలు ప్రతి క్యూబిక్‌కు ఐదు మైక్రో గ్రాములు మించకుండా ఉంటే ఢిల్లి ప్రజల సగటు ఆయుర్దాయం 10 సంవత్సరాలు పెరుగుతుందని ఆ విశ్లేషణ పేర్కొంది.

చికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్‌ (ఇపిఐసి) ఎయిర్‌ క్వాలిటీ లైఫ్‌ ఇండెక్స్‌ ప్రకారం, 2013 నుండి ప్రపంచంలో పెరిగిన కాలుష్యంలో 44 శాతం భారతదేశం నుండి వచ్చింది. 1998 నుండి భారతదేశ సగటు వార్షిక సూక్ష్మరేణువుల కాలుష్యం 61.4 శాతం పెరిగింది. ఎయిర్‌ క్వాలిటీ లైఫ్‌ ఇండెక్స్‌ (ఎక్యూఎల్‌ఐ) కొత్త విశ్లేషణ ప్రకారం వాయు కాలుష్యం సగటు భారతీయ జీవన కాలపు అంచనాను ఐదు సంవత్సరాలు తగ్గిస్తుంది. ఉత్తర భారతదేశంలోని ఇండో-గంగా మైదానాలలో, 510 మిలియన్ల మంది నివసిస్తున్నారు. దేశ జనాభాలో దాదాపు 40 శాతం కాలుష్యపు ట్రాక్‌లో ఉన్నారు.

బంగ్లాదేశ్‌ తర్వాత ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా భారతదేశం ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాలు సగటు కంటే దారుణంగా ఉన్నప్పటికీ, ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరమైన ఢిల్లిdలోని నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీలో వాయు కాలుష్యం జీవితాలను దాదాపు 10 సంవత్సరాలు తగ్గిస్తోందని అధ్యయనం తెలిపింది. వార్షిక సగటు కాలుష్య స్థాయిలు క్యూబిక్‌ మీటర్‌కు ఐదు మైక్రోగ్రాములు మించకుండా ఉంటే ఢిల్లి సగటు ఆయుర్దాయం 10 ఏళ్లు పెరుగుతుందని విశ్లేషణ పేర్కొంది. భారతదేశంలోని 1.3 బిలియన్ల ప్రజలందరూ వార్షిక సగటు సూక్ష్మకాలుష్య స్థాయి డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాన్ని మించి ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారని పేర్కొంది.

జనాభాలో 63 శాతంకంటే ఎక్కువమంది దేశం స్వంత జాతీయ వాయు నాణ్యత ప్రమాణం 40గ్రా/ఎం3ని మించిన ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆయుర్దాయం పరంగా కొలిస్తే, భారతదేశంలో మానవ ఆరోగ్యానికి రేణువుల కాలుష్యం పెనుముప్పు అని, దీనివల్ల ఆయుర్దాయం 5 సంవత్సరాలు తగ్గుతుందని అధ్యయనం తెలిపింది. అంతేకాకుండా తల్లి పోషకాహార లోపం పిల్లల సగటు ఆయుర్దాయాన్ని సుమారు 1.8 సంవత్సరాలు తగ్గిస్తుంది. ధూమపానం సగటు ఆయుర్దాయాన్ని 1.5 సంవత్సరాలు తగ్గిస్తుంది.

ప్రపంచవ్యాపంగా డబ్ల్యుహెచ్‌ఓ మార్గదర్శకానికి (5జి/ఎం3) అనుగుణంగా ఉన్న ప్రపంచానికి సంబంధించిన పార్టికల్‌ వాయు కాలుష్యం ప్రపంచ సగటు ఆయుర్దాయాన్ని 2.2 సంవత్సరాలు లేదా కలిపి 17 బిలియన్‌ జీవిత సంవత్సరాలను తీసుకుంటుందని ఎక్యూఎల్‌ఐ కనుగొంది.

- Advertisement -

ఆయుర్దాయంపై ఈ ప్రభావం ధూమపానంతో పోల్చవచ్చు. ఆల్కహాల్‌ వినియోగం, అపరిశుభ్ర నీటికంటే మూడురెట్లు ఎక్కువ. హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ కంటే ఆరు రెట్లు, కొట్లాటలు, ఉగ్రవాదం కంటే 89 రెట్లు ఎక్కువని విశ్లేషణ పేర్కొంది.
ప్రపంచంలోని దక్షిణాసియాలో వున్నంత ఘోరమై కాలుష్యపు ప్రభావం ఇక ఏ ప్రాంతంలోనూ వుండదు. ఇక్కడ సగానికి పైగా ప్రజలు కాలుష్యంలోనే జీవనాన్ని కొనసాగిస్తున్నారని, ప్రస్తుత అధిక స్థాయి కాలుష్యం కొనసాగితే అక్కడి నివాసితులు సగటున ఐదేళ్ల జీవితాన్ని కోల్పోతారని, అలాగే అత్యంత కలుషితమైన ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement