Tuesday, May 7, 2024

వీడియో: పోలీసుల ఓవరాక్షన్.. బూటు కాళ్లతో తన్నారు

సంగారెడ్డి జిల్లాలో మంగళవారం ఉదయం వాహన తనిఖీలలో భాగంగా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. కొందరు కానిస్టేబుళ్లు మానవత్వం మరిచి ప్రవర్తించారు. ఓ వ్యక్తిని నడి రోడ్డుపై లాఠీలతో దారుణంగా కొట్టారు. సదాశివపేటకు చెందిన వాజిద్ అనే వ్యక్తి బోలెరో వాహనం నడుపుకుంటూ వచ్చాడు. అదే సమయంలో వాహన తనిఖీల్లో భాగంగా బోలేరో వాహనాన్ని పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు.

దీంతో వాజిద్ కొద్ది దూరంలో తన బొలేరో వాహనాన్ని నిలిపాడు. ముందుకు ఆపడంతో.. తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్స్ ఆవేశంతో వాజిద్‌ను లాఠీలతో దారుణంగా కొట్టారు. బూటు కాళ్లతో తన్నుతూ, బూతులు తిట్టారు. కానిస్టేబుల్స్ లాఠీ దెబ్బలతో వాజిద్‌కు తీవ్రగాయాలయ్యాయి. సామాన్యుల పట్ల పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా కానిస్టేబుళ్ల ప్రవర్తనపై ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించామని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనకు కారణమైన కానిస్టేబుల్ రాములు, హెచ్‌జి బాలరాజును సస్పెండ్ చేశామని.. ASI దుర్గయ్య, PC ప్రసాద్‌లను సంగారెడ్డి హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement