Thursday, May 2, 2024

అఖిల్ ను దత్తత తీసుకుంటా…గంగవ్వ

గంగవ్వ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. యూట్యూబ్ ఛానల్ తో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా పాల్గొని అందరినీ ఆకట్టుకుంది. అయితే హౌస్ లో అడుగు పెట్టిన కొద్ది రోజులకే అనారోగ్యం కారణంగా బయటకు వచ్చేసింది. కాగా అదే హౌస్ లో ఉన్న అఖిల్ పై ఎనలేని ప్రేమాభిమానాలు చూపిస్తూ అతనిని దత్తత తీసుకుంటానని… అఖిల్ కు పెళ్లి కూడా చేస్తానని చెప్పేది.

అయితే తాజాగా గంగవ్వ అఖిల్ ఇంటికి వచ్చారు. అఖిల్ కొన్న కొత్త కారుని గంగ ఇంటికి పంపించి మరి పిలిపించుకున్నారు. అఖిల్ ఇంటికి వచ్చిన గంగవ్వ అఖిల్ ను తన ఇంటికి తీసుకు పోతానని ఆయన అమ్మానాన్నలు అన్నా వదినలను అడిగి తీసుకుపోతానని చెప్పుకొచ్చింది. నా కొడుకు ఎలానూ సాదెట్టు లేడు. అందుకే అతను తీసుకుపోతా అంటూ సరదాగా మాట్లాడింది గంగవ్వ.

Advertisement

తాజా వార్తలు

Advertisement