Monday, April 29, 2024

ఈ నెల 4 తేది నుండి పోలీస్ క్రీడలు ప్రారంభం

ఈ నెల 4వ తేది 6వ తేది వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ వార్షిక స్పోర్ట్స్ అండ్ మీట్ 2022 నిర్వహిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి ప్రకటించారు. నిరంతరం విధులు నిర్వహించే పోలీసులు ఆటవిడుపుగా ప్రతి ఏడాది ఒకమారు నిర్వహించే వరంగల్ పోలీస్ క్రీడలను ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నట్లుగా వరంగల్ కమిషనరేట్ పోలీసులకు క్రీడలను నిర్వహిస్తున్నట్లుగా పోలీస్ కమిషనర్ తెలియజేసారు. మూడు రోజుల పాటు జరిగే పోటీలు ఈ నెల నాల్గవ తేదిన హన్మకొండ లోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం నందు ఉదయం 9గంటలకు ప్రారంభమవుతాయి.

ఈ క్రీడా పోటీల్లో వివిధ క్రీడాంశాల్లో డివిజనల్ వారిగా పోలీస్ అధికారులు సిబ్బంది పోటీ పడనున్నారు. ఈ క్రీడల్లో సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్ల పాటు, సిటి ఆర్మూడ్ విభాగం, ట్రాఫిక్, సిసిఆర్ బి, స్పెషల్ బ్రాంచ్, ఐటీ మరియు సైబర్ విభాగాలకు చెందిన పురుష, మహిళ పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ క్రీడా పోటీల్లో పాల్గోనున్నారు. ఈ క్రీడలకు ముగింపు వేడులకు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా హజర్ కానున్నట్లుగా పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ క్రీడలకు సంబంధించి ఎర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని.ఈ పోటీల్లో పోలీస్ క్రీడాకారులు ఉత్సహం పాల్గోని ఈ క్రీడా పోటీలను విజయవంతం చెేయగలరని పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement