Sunday, May 5, 2024

భార‌త మార్కెట్‌లో పోకో ఎఫ్‌5 స్మార్ట్‌ఫోన్ లాంచ్‌.. ఫీచ‌ర్లు, ప్రైస్ డిటెయిల్స్ ఇవే..

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ పోకో. ఈ కంపెనీ త‌మ బ్రాండ్ నుండి సరికొత్త ఎఫ్5 సిరీస్ ను ఇవ్వాల‌ భారత మార్కెట్ లో విడుదల చేసింది. ఈ ఎఫ్5 సిరీస్ లో పోకో ఎఫ్5, పోకో ఎఫ్5 ప్రో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లను అందించే అవకాశం ఉన్నట్లు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోకో ఎఫ్5, ఎఫ్5 ప్రో స్మార్ట్ ఫోన్ల లాంచ్ ఈవెంట్ ను కంపెనీ అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో 5:30 నుండి లైవ్ స్ట్రీమింగ్ అయింది. దీనితో పాటు ఇతర సోషల్ మీడియా ఛానెళ్ల ద్వారా కూడా లైవ్ స్ట్రీమింగ్ అయింది.

Poco F5 5G 8GB RAM వేరియంట్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో మార్కెట్‌లో రూ.29,999కి అందుబాటులో ఉంది. మరోవైపు, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో 12GB RAM వేరియంట్ రూ.33,999 ధరకు మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ డివైజ్ డిజిట‌ల్ సేల్స్ మే 16 మధ్యాహ్నం నుంచి Flipkartలో ప్రారంభమవుతాయి. ఈ ఫోన్ ఎలక్ట్రిక్ బ్లూ, స్నో స్టార్మ్ వైట్ మరియు కార్బన్ బ్లాక్‌తో సహా రెండు విభిన్న రంగు వేరియంట్‌లలో రవాణా చేయబడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement