Sunday, April 28, 2024

PM MODI: ఒడిశాకు మోదీ… అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు…

నేడు ఒడిశా రాష్ట్రంలో పీఎం మోదీ ప‌ర్య‌టించ‌నున్నారు. ప్రధాని మోడీ మధ్యాహ్నం ఝార్సుగూడ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం సంబల్‌పూర్ కు ఆయన వెళ్తారు. ఈ సందర్భంగా జగదీష్‌పూర్హల్దియా, బొకారో-ధమ్రా పైప్‌లైన్ ప్రాజెక్ట్ (జెహెచ్‌బీడీపీఎల్‌)లోని 412 కిలోమీటర్ల పొడవైన ధమ్రా అంగుల్ పైప్‌లైన్ సెక్షన్‌ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు.

అదేవిధంగా ముంబై-నాగ్‌పూర్-ఝార్సుగూడ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌లోని నాగ్‌పూర్-జార్సుగూడ సహజ వాయువు పైప్‌లైన్ సెక్షన్‌కు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు 2,660 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు కానుంది. దీంతో ఒడిశా- మహారాష్ట్ర- ఛత్తీస్‌గఢ్‌ లాంటి రాష్ట్రాల్లో సహజవాయువు లభ్యత మెరుగుపడుతుంది. అలాగే దాదాపు 28,980 కోట్ల రూపాయల విలువైన ప‌లు విద్యుత్ ప్రాజెక్టుల‌కు కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement