Monday, May 29, 2023

Peddapalli: అమరుల ఆశయాలను కొనసాగిద్దాం : అల్లం నారాయణ

తెలంగాణ అమరుల ఆశయాలను కొనసాగిద్దామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో ప్రాణాలు కోల్పోయారని, వారి ఆశయాలను కొన‌సాగించే దిశ‌గా ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌న్నారు. ఇప్ప‌టికే అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుంద‌న్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలుపరుస్తుందని చెప్పారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement